Ninu Choose Kannulu song lyrics:
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా ||2||
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా ||2||
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే||
కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా ||2||
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే||
అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా ||2||
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||