Nee Pilupu valana nenu song lyrics:
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు ||2||
1. నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా…నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా…
నన్ను నడిపించే యజమానుడా
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా ||2||
3. పిలిచిన నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును ||2|| ||నీ పిలుపు||
Wonderful song.. praise the lord 🙏
Please Support this lyrical website also..
https://christianlyricsworld.in
Supar
Supra