Nannu Pilichina Devaa:
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా ||2||
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చుంచునది నీ కృప మాత్రమే ||2||
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా ||2|| యేసయ్యా…
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు ||2||
బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప ||2||
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు ||2||
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప ||2||
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||