Naa jeevithaanthamu song lyrics:
నా జీవితాంతము
నీ సేవ చేతునంటిని
నే బ్రతుకు కాలము
నీతోనే నడుతునంటిని
నా మనవి వింటివి
నన్నాదుకొంటివి ||2|| ||నా జీవితాంతము||
నీ ప్రేమ చూపించి
నన్ను నీవు పిలిచితివి
నీ శక్తి పంపించి
బలపరచి నిలిపితివి ||2||
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా ||2|| ||నా జీవితాంతము||
రోగముతో పలుమార్లు
పడియుండ లేపితివి
ఘోరమై పోకుండా
స్థిరపరచి కాచితివి ||2||
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా ||2|| ||నా జీవితాంతము||
దూషించు దుష్టులకు
సిగ్గును కలిగించితివి
వేలాది ఆత్మలకు
మేలుగ నన్నుంచితివి ||2||
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా ||2|| ||నా జీవితాంతము||
సంఘములు కట్టుటకు
సామర్ధ్యమిచ్చితివి
ఉపదేశమిచ్చుటకు
దేశములు తిప్పితివి ||2||
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా ||2|| ||నా జీవితాంతము||