Naa geethaaraadhanalo song lyrics:
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – ||2|| ||నా గీతా||
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే ||2||
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే ||2|| ||నా గీతా||
చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే ||2||
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే ||2|| ||నా గీతా||
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే ||2||
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై ||2|| ||నా గీతా||