Aparaadhini Yesayya song lyrics :
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా ||2||
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు ||2||
1. సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని ||2||
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా ||2||
2. ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే ||2||
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో ||2||
3. ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి ||2||
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి ||2||
4. దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి ||2||
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను ||2||
5. ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని ||2||
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా ||2||
6. చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత ||2||
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా ||2||
7. శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా ||2||
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా ||2||
Follow this website also for more christian songs. god bless you.