ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా ||2||
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||
పాపాల సంద్రమందున పయనించు వేళలో ||2||
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా ||2||
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||