ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము
రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట ||2||
సాటిలేని నామము – స్వస్థపరచే నామము ||2|| ||నీ నామమునే||
ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత ||2||
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము ||2|| ||నీ నామమునే||
హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా ||2||
అన్ని నామములకు పై నామముగా – (3) ||నీ నామమునే||