ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో ||2||
జాగు చేయక వేగ మేలుకో ||2|| ||ఏ గుంపులో||
మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు ||2||
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు ||2|| ||ఏ గుంపులో||
మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు ||2||
చచ్చియుండిన సమాధుల గుంపు ||2|| ||ఏ గుంపులో||
కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు ||2||
కరకు కల్గిన కఠోరపు గుంపు ||2|| ||ఏ గుంపులో||
యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు ||2||
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు ||2|| ||ఏ గుంపులో||
ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు ||2||
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు ||2|| ||ఏ గుంపులో||
పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు ||2||
కావలి కాయు కఠినాత్ముల గుంపు ||2|| ||ఏ గుంపులో||
సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము ||2||
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు ||2|| ||ఏ గుంపులో||
వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో ||2||
గదిలో చేరుకో పదిలపర్చుకో ||2|| ||ఏ గుంపులో||