ఉదయించినాడు నా జీవితాన
నా నీతిసూర్యుడు నా యేసయ్యా
నా నీతిసూర్యుడు నా యేసయ్యా ||2||
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన వారికిల సమాధానము ||2|| ||ఉదయించినాడు||
మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా ||2||
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||2||
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు||
గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను ||2||
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను నిలుపుకుంటినే ||2||
గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు||
కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా ||2||
కడతేర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను ||2||
ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||