ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను – ||2|| ||ఉదయించె||
ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా ||2||
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా ||2||
మార్గదర్శియై నడిపించువారు ||2||
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె||
చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని ||2||
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు ||2||
మానవాళికై మరణంబునొంది ||2||
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె||
పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్ ||2||
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు ||2||
చీకటి నుండి దైవ వెలుగునకు ||2||
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||