Siddhaparachina Goppa
సిద్ధపరచిన గొప్ప రక్షణ నేను చూడ రండి
ధాత్రివెలసిన యేసు పేరున పాట పాడ రండి || 2 ||
ఆరాధించుడి – ఆనందించుడి || 2||
సర్వలోక జనమా || సిద్ధపరచిన ||
తల్లవుతావనే వార్త చేరెనే మరియమ్మకు కన్నె మరియమ్మకు
కృంగిపోకనే సిద్ధమయానే యేసయ్యకు జన్మనిచ్చేనందుకు
ప్రభువు దాసురాలనని విధేయత చూపింది
పరిశుద్దాత్మ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది || ఆరాధించుడి || || సిద్ధపరచిన ||
దూతవచ్చెనే నిజము చెప్పెనే యోసేపుకు భక్త యోసేపుకు
మనసు మారెనే బయలుదేరెనే చూసేందుకు చేర్చుకునేందుకు
దైవ చిత్తాన్ని ఎరిగే ప్రవర్తన నేర్పింది
వినయమనసు ద్వారానే ఇది సాధ్యం అయ్యింది || ఆరాధించుడి || || సిద్ధపరచిన ||
తార సాగెనే దారి చూపేనా జ్ఞానులకు తూర్పు జ్ఞానులకు
ప్రకాశించెనే ఇల్లు చేర్చెనే మొక్కేందుకు పూజ చేసేందుకు
క్రీస్తు దర్శనం కలిగే సహాయము చేసింది
దైవ బోధ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది || ఆరాధించుడి || || సిద్ధపరచిన ||