Neeve Naa Devudavu Song lyrics:
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను ||2||
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమునుండి జీవముకు నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటినుండి వెలుగునకు నను నడిపించావు
హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే ||2||
నీవే నీవే నీవే నీవే ||2||
పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే
విలువైన నీ కృపచే నను రక్షించావు
కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి
పాపమును క్షమియించి నను విడిపించావు
హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే ||2||
నీవే నీవే నీవే నీవే ||2||