Pasibaaludu Raajuga:
పసిబాలుడు రాజుగా జన్మించెను – లోకమునకు వెలుగై దిగివచ్చెను
ఆకాశములో దేవదూతలు ఆరాధించెను
భూలోకములో సంతోషముతో పొంగిపోయెను
చీకటి జీవితాలను వెలిగించెను ||2||
ఆనందించెదం మనమంతా ఉత్సహించెదం||4|| || పసిబాలుడు ||
1.పాపపు జీవితమును మార్చుటకు – రక్షణజీవితమును ఇచ్చుటకు || 2||
దైవమే మనిషి రూపమై వచ్చెను – పరలోకానికి మార్గము తెరచెను|| 2||
ఆనందించెదం మనమంతా ఉత్సహించెదం||4|| || పసిబాలుడు ||
2.చీకటి నుండి నిన్ను వెలిగించుటకు- మరణము నుండి విడిపించుటకు || 2 ||
దైవ కుమారుడు పరమును వీడెను – పాపికి మోక్షపు మార్గము చూపెను || 2 ||
ఆనందించెదం మనమంతా ఉత్సహించెదం||4|| || పసిబాలుడు ||