Oranna Oranna Song lyrics :
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా ||2||
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును ||2|| ||ఓరన్న||
పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా ||2||
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను ||2|| ||ఓరన్న||
సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న ||2||
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును ||2|| ||ఓరన్న||