ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు ||2||
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా ||2|| ||ఒకని||
ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ ||2||
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా ||2||
నీ చంకపెట్టితివా యేసయ్యా ||2|| ||ఒకని||
నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన ||2||
నను దోచిపోగా నను దాటిపోగా ||2||
బ్రతికింప వచ్చితివా యేసయ్యా ||2|| ||ఒకని||