Oka Varamadigithini Song lyrics :
ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని ||2||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2|| ||ఒక వరమడిగితిని||
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో ||2||
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా ||2|| ||ఒక వరమడిగితిని||
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా ||2||
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని ||2|| ||ఒక వరమడిగితిని||
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు ||2||
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని ||2|| ||ఒక వరమడిగితిని||
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు ||2||
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని ||2|| ||ఒక వరమడిగితిని||