O Sangama Sarvaangamaa:
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము ||2||
పొందితినే యేసునందు ||2|| ||ఓ సంఘమా||
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు ||2||
సహియింతువా తీర్పునాడు ||2|| ||ఓ సంఘమా||
చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా ||2||
సజీవముగా నున్నావా ||2|| ||ఓ సంఘమా||
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో ||2||
ఆసక్తితో రక్షణ పొందుమా ||2|| ||ఓ సంఘమా||