O Krisatava Yuvakaa song lyrics:
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా ||2||
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా ||2||
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా ||ఓ క్రైస్తవ||
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా ||2||
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ||
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా ||2||
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||