Nithyamu Sthuthinchina song lyrics:
నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను ||2||
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు ||2|| ||నిత్యము||
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా ||2||
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు ||2|| ||రాజా||
జీవమైన దేవడా
జీవమిచ్చిన నాథుడా ||2||
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి ||2|| ||రాజా||
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా ||2||
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా ||2|| ||రాజా||