Ninnu Kaapadu Vaadu Kunukadu Song lyrics : John Wesley
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు ||2||
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు ||2|| ||నిన్ను కాపాడు||
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా ||2||
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా ||2||
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను కాపాడు||
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా ||2||
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా ||2||
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను కాపాడు||