Neeve Naa Snehamu song lyrics:
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము
నీవే ఆధారము – నీవే నా ఆనందము
నీ ప్రేమ నాలో పదిలము
నీలోనే సాక్ష్యమే సంతోషము ||2||
సర్వోన్నతుడా నీకే మహిమ
పరమ తండ్రి నీకే ఘనత ||2|| ||నీవే||
నా జీవితాంతం నిన్నే పొగడెదను
నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే ||2||
నా దేవుని మందిరములో నివసించెదను
నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – ||2|| ||సర్వోన్నతుడా||
నా బలహీన స్థితిలో గతివి నీవైతివే
నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే ||2||
కృంగిన నా హృదయమును లేవనెత్తితివి
అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – ||2|| ||సర్వోన్నతుడా||