Neeve Aasha neeve swaasa neevegaa song lyrics:
నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడా
నాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడా
ప్రేమ పూర్ణుడ – నా దేవ- పావనాత్ముడ – యేసయ్య
స్తుతికి పాత్రుడ – నా దేవ – నా నిరీక్షణ – నీవేగ
స్తుతియించెద – సర్వోన్నతా – పూజించెద – ప్రభువా యేసయా
బలమైన నీ నామం
1. నీదు ప్రేమ నిండే నాలో – నీవే చెరగని ప్రపంచం
నాలో నీవు నీలో నేను – నీవే తరగని వరం
వెలిగించవా – నడిపించవా – నీ మాటతో ఇల
వశియించవా – నిజదేవుడా – ఆధారమై ఇల
2. యేసు నీవే నాలో స్వాస్థ్యం – నీతో నిరతము ప్రయాణం
నీతో స్నేహం – నింపే ధైర్యం – నీవే పరముకు పథం
చిరకాలము – నను కాచిన – నా మంచి కాపరి
కనుపాపగా – కాపాడిన – నీవేగ నా గురి