Nee Krupa Nithyamundunu song lyrics:
నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా ||2||
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము ||2|| ||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు ||2||
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా ||2|| ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు ||2||
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే ||2|| ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు ||2||
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా ||2|| ||నీ కృప||