Nee Koraku Naa Praanam song lyrics:
నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి ||2||
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది ||2||
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము ||2||
పాపం చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను ||2||
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను ||2|| ||దేవా||
నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను ||2||
నను మన్నించుమా నా తండ్రి ||2||