Nee Chethilo Rottenu song lyrics:
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా ||2||
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ||2|| ||నీ చేతిలో||
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి ||2|| ||నీ చేతిలో||
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి ||2|| ||నీ చేతిలో||
హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి ||2|| ||నీ చేతిలో||