Nee chethi kaaryamulu song lyrics:
నీ చేతి కార్యములు సత్యమైనవి
నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి ||2||
నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి ||2||
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి ||2||
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా
నీ ఆలోచనలు గంభీరములు
నీ శాసనములు హృదయానందకరములు ||2||
నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి
నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి ||2|| ||బల సౌందర్యములు||
ఎవర్లాస్టింగ్ ఫాదర్
యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్
ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్
నిత్యుడైన తండ్రి
నీ కృప నిరతము నిలచును
నిత్యుడైన తండ్రి – నా యేసయ్య
నీ రూపము ఎంతో మనోహరము
నీ అనురాగము మధురాతి మధురము ||2||
నీ నామము నిత్యము పూజింపతగినది
నీ విశ్వాస్యత నిరతము నిలచునది ||2|| ||బల సౌందర్యములు||