Nee Challani Needalo song lyrics:
నీ చల్లని నీడలో
నీ చక్కని సేవలో ||2||
నా బ్రతుకు సాగనిమ్మయ్యా
యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా ||2|| ||నీ చల్లని||
కష్టాలు ఎన్ని వచ్చినా
వేదనలు ఎదురైనా ||2||
నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా ||2|| ||నీ చల్లని||
ఏర్పరచబడిన వంశములో
రాజులైన యాజకులుగా చేసితివి ||2||
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకే జీవించుట నాకు భాగ్యము ||2|| ||నీ చల్లని||