Nee Challanaina Needalo song lyrics:
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు ||2||
నీ ప్రేమా నా లోనా ||2||
ప్రతిక్షణం అనుభవించనీ ||2|| ||నీ చల్లనైన||
మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు ||2||
పదిలముగా నను పట్టుకొని ||2||
మార్చుకుంటివా నీ పోలికలో ||2||
మరణ భయమిక లేదంటివి ||2|| ||నీ చల్లనైన||
మారా వంటిది నా జీవితం
ఎంతో మదురమైనది నీ వాక్యం ||2||
హృదయములో నీ ప్రేమా ||2||
కుమ్మరించుమా జుంటి తేనెలా ||2||
(ఆహా) మధురం మధురం నా జీవితం ||2|| ||నీ చల్లనైన||
అల్పమైనది నా జీవితం
ఎంతో ఘనమైది నీ పిలుపు ||2||
నీ సేవలో నే సాగుటకు ||2||
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో ||2||
నే ఆగక సాగెద నీ సేవలో ||2|| ||నీ చల్లనైన||