Naalo unna aashalanni song lyrics:
నాలో ఉన్న ఆశలన్నియు
నాలో ఉన్న ఊహలన్నియు
నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా ||2||
యేసయ్యా నీవే నా మార్గం
యేసయ్యా నీవే నా సత్యం
యేసయ్యా నీవే నా జీవం
నీవే నా ప్రాణం
నాకున్నవన్ని నీకే యేసయ్యా
నాలోన నిన్ను దాచానేసయ్యా ||2||
నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి
నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి ||2||
పరిశుద్ధమైన రక్తము ద్వారా
పాపాలన్ని కడిగివేసితివి ||యేసయ్యా||
నా కోసమే ఈ భువికి వచ్చితివి
నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి ||2||
నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని
నీ రాకకై నేను వేచి ఉంటిని ||2||
పరిశుద్ధమైన నీ చేతులలో
నీ రూపములో నన్ను చేసితివి ||యేసయ్యా||