Naalo unna aanandam song lyrics:
నాలో ఉన్న ఆనందం
నాకున్న సంతోషం
నా జీవన ఆధారం నీవే కదా ||2|| ||నాలో||
నా ఆశ్రయము నా దుర్గము
నా కోట నీవే యేసు
నా బలము… నా యేసుడే ||2||
గాఢాంధకారములో నే సంచరించిననూ
ఏ అపాయమునకు నే భయపడను ||2||
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నాదరించును నా యేసయ్యా ||2|| ||నా ఆశ్రయము||
నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును
నన్నాదరించును నా వెంట వచ్చుఁను ||2||
చిరకాలము నేను నీ మందిరావరణములో
నివాసము చేసెదను నా యేసయ్యా ||2|| ||నా ఆశ్రయము||