Naadantu lokaana song lyrics:
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా ||2||
నీదే నీదే బ్రతుకంతా నీదే ||2|| ||నాదంటూ||
నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం ||2||
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ||2||
కేవలం నీదేనయ్య ||2|| ||నాదంటూ||
నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం ||2||
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం ||2||
కేవలం నీదేనయ్య ||2|| ||నాదంటూ||