Naa Vedhanalo Naa Baadhalo song lyrics:
నా వేదనలో నా బాధలో
నే కృంగిన వేళలో – నా తోడైయున్నావు ||2||
నన్ను నడిపించు నా యేసయ్యా
నాకు తోడైయుండు నా ప్రభువా ||2||
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
నా అన్న వారే నను మరిచారయ్యా
అయినవారే నన్ను అపహసించినారయ్య
నా కన్న వారిని నే కోల్పోయినా
నా స్వంత జనులే నన్ను నిందించినా
కన్నీటిని తుడిచి కౌగిలించినావు
కృప చూపి నన్ను రక్షించినావు ||2||
నన్ను నడిపించు నా యేసయ్యా
నాకు తోడైయుండు నా ప్రభువా ||2||
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||
ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని
ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని ||2||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని
చావైతే నాకది ఎంతో మేలని ||2||
నా కన్నులెత్తి నీ వైపుకే
నిరీక్షణతో చూచుచున్నాను ||2||
నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||