Naa vanni yangeekarinchumi song lyrics: Pulipaaka Jagannaathamu
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన ||2||
భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని||
నీకు నా ప్రాణము నిజముగా నర్పించి ||2||
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||
సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని ||2||
నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని||
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు ||2||
ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||
పెదవులతో నేను బెంపుగ నీ వార్త ||2||
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని||
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ ||2||
యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని||
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే ||2||
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని||
చిత్తము నీ కృపా యత్తంబు గావించి ||2||
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని||
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి ||2||
పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||