Naa pranama naalo neevu song lyrics:
నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు ||2|| ||నా ప్రాణమా||
ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ ||2||
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా ||2||
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా ||2|| ||నా ప్రాణమా||
ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ ||2||
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా ||2||
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా ||2|| ||నా ప్రాణమా||
ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్య జీవితమే కరువైననూ ||2||
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ ||2||
క్రీస్తునికే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా ||2|| ||నా ప్రాణమా||