Naa Pere Theliyani Prajalu song lyrics:
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా ||2||
వెళతారా – నా ప్రేమను చెబుతారా ||2||
రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో ||2|| ||ఎవరైనా||
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు ||2|| ||ఎవరైనా||
వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి ||2|| ||ఎవరైనా||