Naa notan krottha paata song lyrics:
నా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను ||2||
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా ||2|| హల్లెలూయా ||నా నోటన్||
అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను ||2|| ||ఆనందించెదను||
దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను ||2|| ||ఆనందించెదను||
నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును ||2|| ||ఆనందించెదను||
వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను ||2|| ||ఆనందించెదను||
భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను ||2|| ||ఆనందించెదను||