Naa jeevitha yaathralo song lyrics:
నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు ||2|| ||నా జీవిత||
పలు విధ శోధన కష్టములు
ఆవరించియుండగా ||2||
కలత చెందుచున్న హృదయమును
కదలక కాపాడుము ||2|| ||నా జీవిత||
నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు ||2||
నీదు కుడి హస్తములో నిత్యమున
నాకు సుఖ క్షేమముగా ||2|| ||నా జీవిత||
ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా ||2||
మారని వాగ్ధానములన్నియు
నే నమ్మి సాగెదను||2|| ||నా జీవిత||
ముందున్న సంతోషము తలంచి
నిందలను సహించి ||2||
నీ సిలువను నే మోయుటకై
నీ కృప నాకీయుము ||2|| ||నా జీవిత||
సీయోను యొక్క ఆలోచనతో
సదా నడిపించుము ||2||
మహిమలో నీతోనే నిల్చుటకు
నా తండ్రి దయచూపుము ||2|| ||నా జీవిత||