Naa jeevitha vyathalandu song lyrics:
నా జీవిత వ్యధలందు యేసే జవాబు
యేసే జవాబు – ప్రభు యేసే జవాబు ||2|| ||నా జీవిత||
తీరని మమతలతో ఆరని మంటలలో
ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే ||2||
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||
చీకటి వీధులలో నీటుగా నడచితిని
లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని ||2||
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||
హంగుల వేషముతో రంగుల వలయములో
నింగికి నేనెగిరి నేలను రాలితిని ||2||
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||