Naa devuni gudaaramulo song lyrics: Jayaraj
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో ||2||
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం ||2||
నా యేసుని నివాసములో ||2|| ||నా దేవుని||
సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా ||2||
నా కొండ నీవేగా – నా కోట నీవేగా ||2||
నా యేసు రక్షకా నీవే కదా ||2|| ||నా దేవుని||
నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను ||2||
నా గానమాయెనే – నా ధ్యానమాయెనే ||2||
నాదు స్వరము నా ప్రభువే ||2|| ||నా దేవుని||
ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా
నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా ||2||
నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా ||2||
నా యేసు నాథుడా నీవే కదా ||2|| ||నా దేవుని||