Naa aashala pallaki song lyrics:
నా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే ||2||
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా ||2||
ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది ||2||
నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని ||2||
దాహము తీర్చావని ||యేసయ్యా||
దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా
నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే ||2||
నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే
తోడుగ ఉన్నావని ||2||
తోడుగ ఉన్నావని ||యేసయ్యా||
స్నేహితులు లేరని – తోడెవరు రారని
నా మనసు నాలోన – దుఃఖించు సమయాన ||2||
నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు
ఆదరించావయ్యా ||2||
ఆదరించావయ్యా ||యేసయ్యా||