Kreesthu Puttenu :
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే ||2||
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే
పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా ||2||
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను ||2|| || అరె గొల్లలొచ్చి ||
కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను ||2||
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ ||2|| || అరె గొల్లలొచ్చి ||