Karuninchava Naa Yesuaa :
కరుణించవా నా యేసువా
ఓదార్చవా నజరేతువా ||2||
నీ కృపలో అనుదినము రక్షించవా
నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా ||2|| ||కరుణించవా||
1. నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ
బలమైన శోధన నను తరిమిన వేళ ||2||
మిత్రులే శత్రువులై దూషించిన వేళ ||2||
లోకమే విరోధమై బాధించిన వేళ ||2|| ||కరుణించవా||
2. ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ
నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ ||2||
సాతాను పోరాటమే అధికమైన వేళ ||2||
విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ ||2|| ||కరుణించవా||