Karunaamayudaa Paraloka raaja:
కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా ||2||
నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు ||కరుణామయుడా||
1. గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు ||2||
విడువక నా యెడల కృప చూపినావు ||2||
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ ||2|| ||నీకే స్తోత్రములు||
2. శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో ||2||
సహించే శక్తి నాకిచ్చినావు ||2||
నీ సేవలో నన్ను నడిపించినావు ||2|| ||నీకే స్తోత్రములు||
3. నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా ||2||
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి ||2||
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త ||2|| ||నీకే స్తోత్రములు||