Kanulunnaa Kaanaleni:
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని ||2||
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని ||2||
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను ||2|| ||కనులున్నా||
1. అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా ||2||
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును ||2|| ||కనులున్నా||
2. భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా ||2||
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని ||2|| ||కనులున్నా||
3. బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా ||2||
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని ||2|| ||కనులున్నా||