Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Kannula Ninduga - కన్నుల నిండుగ

Kannula Ninduga – కన్నుల నిండుగ

Posted on July 5, 2023

Kannula Ninduga: Anil Vemula

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ – ఆనందముండుగ ||2||
పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ
మహిమలోనుండే – మహిమాత్ముండు
మనుజుడాయెగా – మరణము నొందగా
రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం ||2||

1. సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా ||2||
చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు ||2||
నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని ||రండి||

2. విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా ||2||
దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను ||2||
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని ||రండి||

3. ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా ||2||
సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు ||2||
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని ||రండి||

For Video Song: Kannula Ninduga – కన్నుల నిండుగ

Kannula Ninduga

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Betlehemulo Najarethu – బెత్లెహేములో నజరేతు
  • Divilo Veduka – దివిలో వేడుక
  • O Hallelujah O Hallelujah – ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
  • Neeve Naa Snehamu – నీవే నా స్నేహము
  • Neeve Naa Rakshana- నీవే నా రక్షణ

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme