Kanneeti loyalalo:
కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును ||2||
నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు ||2|| ||కన్నీటి||
1. చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై ||2|| ||నీ మనసు||
2. ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ ||2|| ||నీ మనసు||
3. ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు ||2|| ||నీ మనసు||