Kanneere manishini:
కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది ||2||
కన్నీరే కాదనుకుంటే
ఓదార్పే కరువైపోతుంది ||2|| ||కన్నీరే||
కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణము గెలిపించింది ||2||
కన్నీరే కాదనుకుంటే
లాజరు తిరిగి బ్రతికేనా ||2||
కన్నీరే వలదనుకుంటే
దేవుని మహిమ కనిపించేనా ||2|| ||కన్నీరే||
కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారుని దయచేసింది ||2||
కన్నీరే కాదనుకుంటే
సమూయేలు జన్మించేనా ||2||
కన్నీరే వలదనుకుంటే
దేవుని కృపను గాంచేనా ||2|| ||కన్నీరే||