Kanaleni Kanulelanayya:
కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా
1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా ||2||
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
2. దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా ||2||
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
3. మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా ||2||
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
4. రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా ||2||
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
5. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా ||2||
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||