Kammani Bahukammani:
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని
తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం ||2||
జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం ||2||
యేసు నీ ప్రేమామృతం ||2|| ||కమ్మని||
1. ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన ||2||
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము ||2||
కడిగిన ముత్యముగా అయ్యాను నేను ||2|| ||కమ్మని||
2. నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ ||2||
ఆరాధింతును నిన్ను అనుదినము ||2||
జీవింతును నీకై అనుక్షణము ||2|| ||కమ్మని||